గోప‌న్‌ప‌ల్లి ఇందిరాన‌గ‌ర్‌లో విద్యుత్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలించిన కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోప‌న్‌ప‌ల్లి తాండా ఇందిరానగర్ కాలనీలోని నర్మద సరోవర్ అపార్ట్మెంట్స్‌లో స్థానిక కార్పొరేట‌ర్ గంగాధర్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారుల‌తో క‌ల‌సి ప‌ర్య‌టించారు. స్థానికంగా ఎదురవుతున్న విద్యుత్ స‌మ‌స్య తీవ్ర‌త‌ను అపార్ట్‌మెంట్ వాసులు కార్పొరేట‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. వెంట‌నే కొత్త కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి మెరుగైన విద్యుత్ సేవలు అందించాలని, స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను దూరం చేయాల‌ని విద్యుత్ అధికారులకు కార్పొరేట‌ర్ సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, విద్యుత్ శాఖ అధికారులు డిప్యూటీ ఇంజనీర్ శ్రీకాంత్, సూపర్ వైజర్ రాజు, స్థానిక నాయ‌కులు పాల్గొన్నారు.

విద్యుత్ స‌మ‌స్య‌ల‌ను కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డికి వివరిస్తున్న ఇందిరాన‌గ‌ర్ వాసులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here