నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్‌లో మంగళవారం స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. బస్తీలో నెలకొన్న డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి పైప్ లైన్ సరిగా లేక రోడ్డు పైకి డ్రైనేజీ నీళ్లు రావటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్టు స్థానికులు కార్పొరేటర్‌కు తెలిపారు. స్పందించి రాగం నాగేందర్ యాదవ్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించారు. కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు బాపునగర్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేసి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వాటర్ బోర్డు డీజేఎం నారాయణ, ఏఈ యాదగిరి, వర్క్ ఇన్ స్పెక్టర్ మోహన్, కాలనీ వాసులు, షాధిక్, ఇజాజ్,గణపురం రవీందర్,ఇక్బాల్,గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
