సిరిపురం సురేష్ చారి ప్రథమ వర్ధంతి.. నివాళులర్పించిన బీసీ సంఘాల నేతలు

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): లింగంపల్లి తారానగర్‌లోని గోపీనాథ్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో సిరిపురం సురేష్ చారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ పాల్గొని సురేష్ చారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి, సురేష్ చారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కె. సాయన్న ముదిరాజ్, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ముఖ్య సలహాదారు పట్లూరి కృష్ణమోహన్, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మేదరి మహేంద్ర సంఘం మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు కొంటు ముకుందం, ఆయన సతీమణి కొంటు విజయ ముకుందం, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక, మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు కొంటు సుమన్ పాల్గొన్నారు. అలాగే బీసీ నాయకులు, అన్నానగర్ అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్, బీహెచ్‌ఈఎల్ అధ్యక్షుడు కీర్తి కుమార్‌తో పాటు పలువురు బీసీ నాయకులు కార్యక్రమానికి హాజరై సురేష్ చారికి నివాళులర్పించారు.

సురేష్ చారి సోదరుడు, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ హరికృష్ణ చారి ఆధ్వర్యంలో కార్యక్రమానికి హాజరైన వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సురేష్ చారి సేవలను స్మరించుకుని ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here