మియాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై సిఎంసీ చర్యలు.. రెండు భవనాలు సీజ్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లో మంజూరైన నిర్మాణ ప్రణాళికలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సిఎంసీ) అధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్ సృజన, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ అధికారులు రెండు భవనాలను సీజ్ చేశారు. ఇందిరా నగర్‌లోని ప్లాట్ నంబర్ 3, సర్వే నంబర్లు 58/2, 59/2లో నిర్మించిన భవనంలో మంజూరైన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడంతోపాటు వినియోగ నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. భవనంలో అనధికారిక సెల్లార్ కూడా ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు.

అదే విధంగా ఇందిరా నగర్‌లోని ప్లాట్ నంబర్ 5 (పార్ట్), సర్వే నంబర్ 52లో మంజూరు చేసిన నిర్మాణ ప్రణాళికకు విరుద్ధంగా నిర్మించిన మరో భవనంపైనా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ భవనాన్ని కూడా ఏసీపీ అధికారులు సీజ్ చేశారు. కమిషనర్ సృజన ఆదేశాల మేరకు మియాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ శ్రీనివాస్ జి ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సిఎంసీ అధికారులు తెలిపారు. మంజూరైన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం, నిబంధనలను ఉల్లంఘించడం వంటి వాటిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here