కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికలలో కొండాపూర్ డివిజన్ తెరాస కార్పొరేటర్ గా హమీద్ పటేల్ ఘన విజయం సాధించిన సందర్బంగా సిద్దిక్ నగర్ లోని పలు యువ, సీనియర్ నాయకులు కూకట్‌పల్లిలోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసానికి తరలివెళ్లి ఆయనను, హమీద్ పటేల్ లను కలసి అభినందనలు తెలియజేశారు. సిద్దిక్ నగర్ బస్తీ వాసులు సాగర చౌదరి, గణేష్ యాదవ్, జి.రాజు, బస్వారాజ్, ఆనంద్, రాజు, కృష్ణ, రాజేష్, యూత్ నాయకుడు దీపక్ ఉన్నారు.
