మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హఫీజ్‌పేట, మాదాపూర్ డివిజన్ల నుంచి తెరాస కార్పొరేటర్లుగా మళ్లీ గెలుపొందినందుకు గాను పూజిత, జగదీశ్వర్ గౌడ్‌లు శనివారం డివిజన్ల ఇన్‌చార్జిలుగా పనిచేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డిలను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.



