నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, అసంపూర్తిగా ఉన్న రోడ్లను నిర్మించేలా చూడాలని కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ వాసులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి విజ్ఞప్తి చేశారు. సోమవారం మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ సిద్దిఖ్ నగర్ వాసులు ఎమ్మెల్యే గాంధీకి వినతి పత్రం అందజేశారు. సిద్దిఖ్ నగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని, అసంపూర్తిగా మిగిలిన రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని కాలనీ వాసులు కోరారు. ప్రభుత్వ విప్ గాంధీ స్పందిస్తూ కాలనీలో నెలకొన్న అన్ని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను పూర్తి చేసి రోడ్ల నిర్మాణం చేపడుతామన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజ్, సిద్దిఖ్ నగర్ కాలనీ వాసులు తిరుపతి రెడ్డి, బసవ రాజు, మహేష్, శ్రావణ్, యాదయ్య గౌడ్, ఆనంద్, సాగర్, మాల్యాద్రి, రాము యాదవ్, నరేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.