నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్ పనులను త్వరిగతిన చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జడ్సీ ప్రియాంక అల, చందానగర్, శేరిలింగంపల్లి సర్కిళ్లకు చెందిన డిప్యూటీ కమిషనర్లు సుదాంష్, వెంకన్న తో పాటు ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ప్రభుత్వ విప్ గాంధీ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నియోజవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. అదే విధంగా పలు డివిజన్లలో పెండింగ్ పనులను వెంటనే చేపట్టాలని సూచించారు. అత్యవసర నిమిత్త పనులకు, పెండింగ్ పనులకు నిధులు సమకూర్చాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులతో పేర్కొన్నారు. ప్రజల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేయాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులకు నిధులను మంజూరి చేసి వెంటనే పూర్తయ్యేలా చూడాలని అదేశించారు. ప్రజలకు అవసరపడే, సమస్యల పరిష్కారం కోసం కొత్త పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈలు శ్రీనివాస్, శ్రీకాంతిని తదితరులు పాల్గొన్నారు.