నమస్తే శేరిలింగంపల్లి: తాళం వేసిన కిరాణా షాపులే వారి లక్ష్యం.. వ్యసనాలకు అలవాటుపడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను మియాపూర్ పోలీసులు ఎట్టకేలకు కాపు కాసి చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం. వారం రోజుల క్రితం మియాపూర్, చందానాగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 చోట్ల షటర్లు లేపి దొంగతానికి పాల్పడ్డ విషయం విదితమే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మియాపూర్ పోలీసులు నిఘాను పెంచారు. ఈ క్రమంలో మళ్ళీ దొంగతనం చేసేందుకు దీప్తి శ్రీ నగర్ లో దొంగలు తచ్చాడు తుండగ వల పన్ని ఇద్దరిని పట్టుకున్నారు. సనత్ నగర్ కు చెందిన సర్దార్ జగ్ జోత్ సింగ్(20) ప్యాకింగ్ కంపెనీ లో ఉద్యోగిగా పనిచేస్తుండగా పల్లపు మల్లిఖార్జున్ (21) పాన్ షాప్ నడుపుతున్నాడు. మూడో వ్యక్తి వివేక్ గౌడ్ ఇటీవల ఆక్సిడెంట్ కావడంతో యశోద లో చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు. వీరంతా దోచుకున్న డబ్బులతో మద్యం సేవించడం, వ్యభిచార గృహాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. డబ్బులు అయిపోగానే మళ్ళీ దొంగ అవతారం ఎత్తుతారు. వారి నుంచి 2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు మియాపూర్ లో 4, మాదాపూర్ లో 2, చందానగర్ లో 2, జీడిమెట్ల లో 2, కేపీహెచ్ బీ లో 4 దొంగతనాలు చేసి మొత్తం రూ. 4 లక్షల 92 వేల 500 అపహరించారు. వీరి వద్ద నుంచి 2వేల నగదు ను రాబట్టారు.