నమస్తే శేరిలింగంపల్లి: నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థి దశలో మంచి క్రమశిక్షణ తో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ పేర్కొన్నారు. సందయ్య మెమొరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లింగంపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బాలబాలికలకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణను అలవరుచుకుని ఉన్నత విద్యనభ్యసించాలని అన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో అన్ని అవరోధాలను ఎదిరించి నిలవాలంటే విద్య చాలా అవసరం అన్నారు. మా నాన్నగారు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారని, ఈ స్కూల్లో చదువుకుని ఎంతో మంది ఆయా రంగాల్లో రాణిస్తూ ఉన్నత స్థాయి పదవులలో ఉన్నారన్నారు. మున్ముందు పై చదువులకోసం ఎలాంటి అవసరాలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా సందయ్య మెమోరియల్ ట్రస్టు ద్వారా సహాయసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శంకర్, నాయకులు వెంకటరెడ్డి పటేల్, ఎల్లేశ్, రాధాకృష్ణ యాదవ్, భరత్ కుమార్, రమేష్, వినోద్ యాదవ్, గణేష్, శివరాజ్, బాబు, రాము, మల్లేశ్ గౌడ్, మల్లికార్జున్ రెడ్డి, అఖిల్, వినయ్, పద్మ, విజయలక్ష్మి, అరుణ ,రేణుక, సుశీల, తదితరులు పాల్గొన్నారు.