చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని శ్రీ భవాని శంకర స్వామికి ప్రథమ హారతి, గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, కుంభాభిషేకం, లక్షమారేడు దళములతో బిల్వార్చన, మహిళా భక్తులచే సామూహిక లక్షకుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ప్రధాన హోమం చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ భవాని శంకరులకు శాంతి కల్యాణం నిర్వహిస్తారు. ఈ పూజా కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

