చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చందానగర్‌లోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు ఆదివారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నినాదాలు చేశారు. డివిజన్ బిజెపి అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నేతలు కసిరెడ్డి భాస్కరరెడ్డి, నాగం రాజశేఖర్, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, జనసేన డివిజన్ కోఆర్డినేటర్ శ్రీదేవి, డివిజన్ నాయకులు పగడాల వేణుగోపాల్, శ్రీనివాస్ ముదిరాజ్, లలిత, శ్రీనివాస్ గుప్త, అమిత్ దూబే, అమరేంద్ర ప్రతాప్ సింగ్ పాల్గొన్నారు.

