చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చందానగర్ డివిజన్ తెరాస కార్పొరేటర్‌గా గెలుపొందినందుకు గాను కార్పొరేటర్ మంజులా రెడ్డి దంపతులు ఆదివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంజుల రెడ్డి, రఘునాథ్ రెడ్డిలు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ మర్యాదల ప్రకారం శ్రీవారి శేష వస్త్రాలతో వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
