- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే సామర్థ్యం కేవలం సీఎం కేసీఆర్‌కే ఉందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిలు అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం, దర్గా, నానక్‌రాంగూడలలో డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి వారు ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే కేవలం తెరాసతోనే సాధ్యమన్నారు. ఇతర పార్టీలకు ఓటు వేస్తే ప్రజల ఓట్లు వృథా అవుతాయన్నారు.


ప్రజలు తమకు సేవ చేసే నాయకులనే గెలిపించుకోవాలని సూచించారు. తెరాస ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టిందన్నారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని, అందుకనే వారి కోసం ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. గ్రేటర్‌లో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే నగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ ముదిరాజ్, రాజు నాయక్, రాజు ముదిరాజ్, సతీష్, నరేష్, చెన్నం రాజు, అంజమ్మ, వెంకట్ పాల్గొన్నారు.
