నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్ లోని శిల్పారామం లో ఓ వైపు ఆల్ ఇండియా సారీ మేళ, నవరాత్రి ఉత్సవాలు, మరో వైపు బతుకమ్మ సంబరాలతో సందడిగా మారింది. ఆల్ ఇండియా సారీమేళాలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేతలు వస్త్ర ప్రదర్శనలతో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. పోచంపల్లి , గద్వాల్, నారాయణపేట, కలంకారీ, మంగళగిరి, చీరల కొనుగోలుకు మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. శిల్పారామం లో మహిళా సిబ్బంది ప్రతిరోజు బతుకమ్మను పేర్చి ఆడుకుంటున్నారు. సాయంత్రం చిన్నాపెద్దలంతా కలిసి దాండియా ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా డాక్టర్ గౌతమీ రవి చంద్ర శిష్య బృందం చేసిన నవదుర్గామృతం భరతనాట్యం నృత్య రూపకం ఎంతగానో ఆకట్టుకుంది. నవ దుర్గ మాత అమ్మవార్ల లీలలను కళాకారులు చక్కగా ప్రదర్శించారు. ఒక్కో దుర్గామాత అవతరణ అమ్మవార్ల అవతరణ వృత్తాంతం గురించి చక్కగా వివరించారు.