నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో అంతర్జాతీయ హస్తకళల మేళా సందర్శకులను ఆకట్టుకుంటుంది. నగరం లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు ఆయా రాష్ట్రాలకు చెందిన చేనేత చీరలను ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. చీరలు, టుస్సార్ పట్టు, కాటన్, మెర్సిడెస్, బెంగాలీ చీరలు, జ్యూట్ బాగ్స్, లక్క బ్యాంగిల్స్, మధు బని పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, తంజావూర్ పెయింటింగ్, మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్, పెయింటింగ్ డ్రెస్ మెటీరియల్స్, పరుపులు, రజాయిలు, పిల్లో చొవెర్స్, డోర్ కర్టైన్స్, గాజులు, కాటన్ షర్ట్స్ తదితర హస్తకళలను స్టాళ్లలో ప్రదర్శించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఉమా శంకర్ బృందంచే వేణువు నాదం శ్రావ్యంగా ఆలపించారు. మొహినియాట్టం నృత్య ప్రదర్శనను అనిత పీటర్ శిష్య బృందం ప్రదర్శించారు. గణేశా శ్లోకం ఏకదంతాయ, స్వాతి తిరుణాల్ జతిస్వరం, నవరసాంజలి, తిల్లాన అంశాలను సుమ, కేదార్నాథ్, దియా,పూజ రాధికా, ప్రభ రాంగోపాల్ తదితరులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అనిత పీటర్, త్రిసూర్ రామచంద్రన్, దత్తాత్రేయులు, సాయి కోలంక తదితరులు సహకరించారు.