గోల్డెన్ తులిప్ ఎస్టేట్స్ లో రూ. 61.80 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని, దశల వారీగా అన్ని సమస్యలను పరిష్కరించి కొండాపూర్ డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ ఎస్టేట్స్ కాలనీలో రూ.61.80 అంచనావ్యయంతో చేపట్టనున్న వీడీసీసీ రోడ్డు, స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ అభివృద్ధి పనులు చేస్తోందని అన్నారు. కొండాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ గోల్డెన్ తులిప్ కాలనీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఎన్నో ఏళ్ల సమస్య నేటితో తీరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పేరుక రమేష్ పటేల్, చాంద్ పాషా, జంగంగౌడ్, శ్రీనివాస్ చౌదరి, బాలరెడ్డి, రజనీకాంత్, మధు ముదిరాజ్, నిర్మల యూత్ నాయకులు దీపక్, కాశెట్టి అంజి, గోల్డెన్ తులిప్ ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె. విద్యా సాగర్, వైస్ ప్రెసిడెంట్ ఎస్వీయన్ రాజు,ట్రెజరర్ బెనర్జీ, జాయింట్ సెక్రటరీ అమర్ నాథ్, అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

కొండాపూర్ డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here