నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మొహర్ పార్కు నేతాజీ నగర్ కాలనీ సాయి బాబా దేవాలయంలో దత్తాత్రేయుని జయంతి మహోత్సవాలు అంగరంగవైభవంగా ఆదివారం జరిగాయి. శ్రీ బృందావన క్షేత్రం ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హిమాలయ పర్వత తపస్వి శ్రీ సిద్ద యోగి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు రాఘవేందర్ జోషి పంతులు ఆధ్వర్యంలో మహా చండి హోమం నిర్వహించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ చైర్ పర్సన్ రాగం సుజాత నాగేందర్ యాదవ్ పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆర్ ఎన్ వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ రాగం అనిరుద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.