నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా క్రాంతి కిరణ్ , పద్మావతి ఆర్ట్ అకాడమీ వారి శిష్య బృందం సభ్యులతో కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక కౌతం, పూజ నృత్యం, నమశ్శివాయతేయ్, నగుమోము, జయ జయ రామనాధ, జతిస్వరం, తరంగం, దశావతారాలు, తిల్లాన అంశాలను రేవతి, రమ్య, శ్రీయ, ప్రణయ, అభిష్ట తదితరులు ప్రదర్శించి పలువురిని మెప్పించారు.