కాపు సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తాం – కాపుల ఆత్మగౌరవ సభలో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని నరేన్ గార్డెన్స్ లో తెలంగాణ కాపు సంఘాల సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో కాపుల ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవి చంద్ర, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేద వ్యాస్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణ రావు, కేపీ వివేకానంద గౌడ్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, గాజులరామరం కార్పొరేటర్ రావుల శేషగిరి రావు, తెలంగాణ కాపు సంఘాల సంక్షేమ సేవా సమితి ప్రెసిడెంట్ మిరియాల రాఘవరావు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ కొండా దేవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలను సమానంగా చూస్తూ సమప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ముగ్గురం ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంబీపూర్ రాజుతో కలిసి త్వరలోనే కాపు సంఘం భవన నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఐదెకరాలు కేటాయించి భూమి పూజ చేసుకునేలా తోడ్పడుతామని ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఎన్ మూర్తి, సభ్యులు దాసరి రంగారావు, సుబ్బారావు, త్రినాదుడు, విష్ణుమూర్తి, అడుసుమల్లి వెంకటేశ్వర రావు, మిర్యాల ప్రీతమ్, గంధం రాజు, వర ప్రసాద్, భరత్ కుమార్, సమ్మెట ప్రసాద్, నాయుడు, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

కాపు సంఘం ఆత్మగౌరవ సభలో భారతీయ కాపు ఐక్య వేదిక పోస్టర్ ను విడుదల చేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here