నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో ఉపేంద్ర మహారథి శిల్ప అనుసంధాన్ సంస్థాన్ , బీహార్ ప్రభుత్వం ఆధ్వర్యం లో బీహార్ క్రాఫ్ట్ ఫెయిర్ నిర్వహించారు. బీహార్ నుండి 80 మందికి పైగా చేనేతలు తయారు చేసిన ఖాదీ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, వెదురుతో అల్లిన రంగు రంగుల బుట్టలు, మధుబని పెయింటింగ్ , సిక్కి ఆర్ట్, టికులి ఆర్ట్, సుజని ఆర్ట్ తదితర చేనేత హస్తకళలు ఆకట్టుకున్నాయి.

వేముల రాధికా శిష్య బృందం కళాకారులు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. భజమానస, అన్నది స్తుతి, తిల్లాన, దశావతార శబ్దం, జతిస్వరం, తరంగం, ముద్దుగారేయ్ యశోద, పలుకీ బంగారమయేహ్న, అష్టలక్ష్మి స్తోత్రం, తీరు త్రిరూ జవరాల, శివలీలలు, తదితర అంశాలను ప్రదర్శించారు. శ్రీకా వర్మ వారి బృందం గౌరవ్ గత, నృత్యం, బీహార్ జానపద పాటలు ఆలపించారు.
