నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర నేత, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పై దాడి చేయడం పిరికిపంద చర్య అని బిజెవైఎం రాష్ట్ర నేత, చందానగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్డి సింధూ రెడ్డి పేర్కొన్నారు. మల్లన్నపై దాడి పట్ల ఆమె తీవ్రంగా ఖండించారు. ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే శణార్తి తెలంగాణ పత్రికా కార్యాలయం పై కొందరు వ్యక్తులు దాడి చేయడం పత్రికా స్వేచ్ఛ పై దాడిగా ఆమె పేర్కొన్నారు. భాష, తిట్లకు పురుడు పోసింది కేసీఆర్, కేటీఆర్ అని, మీకు తప్పుగా అనిపించినపుడు చట్టప్రకారం చర్యలు తీసుకోకుండా భౌతిక దాడులకు పాల్పడడం క్షమించరాని సంఘటన అని కసిరెడ్డి సింధూ రెడ్డి అన్నారు. దాడుల సంస్కృతికి తెరదీసిన అధికార పార్టీ తెలంగాణను మరో ‘బెంగాల్’ చేయాలనుకుంటుందా అని ఆమె ప్రశ్నించారు. ఓ జాతీయ పార్టీ నాయకుడిపై దాడికి తగిన రీతిలో సమాధానం ఉంటుందని ఆమె హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ లో దాడులు సరైన విధానం కాదని ఆమె హితవు పలికారు.
