నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో కర్ణాటక రాష్ట్రం కళాకారులు ప్రదర్శించిన భరతానాట్య ప్రదర్శన అందరిని అలరింపజేసింది. శ్రీ కళారాధన భరతనాట్య నృత్యశాల చిత్రదుర్గ కర్ణాటక రాష్ట్రం నుండి విచ్చేసిన గురువు విదుషి జ్యోతి శిష్య బృందం వారి భరతనాట్య నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. గణేశా పుష్పాంజలి, మిశ్రా అలరిపు, గురు బ్రహ్మ, నృసింహ కౌతం, హనుమాన్ చాలీసా, దేవీస్తుతి, భో శంభో, కళింగ నర్తన, కలియుగ వైకుంఠ పూరి, మహాప్రాణ దీపం, జయ జయ నంద కిశోర హరేయ్, ఆత్మ రామ తదితర అంశాలను జ్యోతి, నికిత, హ్రితిక, దేవిక, వర్షిణి, లక్ష్మి ప్రసన్న, దీప్తి, దివ్యశ్రీ, మౌనిక, సంజన, మానస, హర్షిత,పూజ, సాయి నిశిత కళాకారులు ప్రదర్శించి మెప్పించారు. హైదరాబాద్ లో శిల్పారామం వేదిక మీద ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉందని గురువు జ్యోతి చెప్పారు.