నమస్తే శేరిలింగంపల్లి: త్యాగం, దయ, సానుభూతి, క్రమశిక్షణ, దానగుణాలను నేర్పే పవిత్ర రంజాన్ పర్వదినం ముగిసిన తర్వాత ఆత్మీయ కలయికనే ఈద్ మిలాప్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మొహర్ కాలనీలో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. గుల్ మొహర్ ముస్లిం సోదరులు స్మశాన వాటిక కావాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ స్మశాన వాటిక ఏర్పాటు పై సాధ్య సాధ్యాలను పరిశీలించి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. గుల్ మొహర్ కాలనీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, అన్ని రకాల మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. అతి త్వరలోనే మరో 4 కి.మీ మంచినీటి పైప్ లైన్ నిర్మాణం పనులు చేపడుతామని గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో గుల్ మొహర్ కాలనీ ప్రెసిడెంట్ షేక్ ఖాసీం, జనరల్ సెక్రటరీ జె. నిరంజన్ రెడ్డి, ట్రెజరర్ కిషోర్ బాబు, మొహమ్మద్ అబ్దుల్ ఖదీర్, సమీర్ పటేల్, మొహమ్మద్ సలీం, ఖాజామొయినొద్దీన్, అబ్దుల్ రజాక్ అహ్మద్, మహమ్మద్ షకీల్, సయ్యద్ మజీద్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్, మొహమ్మద్ షరీఫ్, ముంతాజ్ బేగం, నస్రీన్ బేగం కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.