నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి నిత్యం యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని గుల్ మొహర్ పార్క్ కాలనీ అధ్యక్షుడు ఖాసీం అన్నారు. పతాంజలి మెగా యోగా శిబిరాన్ని గుల్ మొహర్ పార్క్ కాలనీలో కాలనీ అధ్యక్షుడు ఖాసీం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారాలన్నారు. యోగా, ప్రాణామాయాల వల్ల శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని అన్నారు.
జీవితాల్లో చాలా మార్పులు వస్తాయని, ఆయుష్షు పెరుగుతుందన్నారు. పతంజలి యోగ సమితి, భారత స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి మే 21వ తేదీ వరకు ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు వస్పరి శివుడు శిక్షణలో ఉచిత యోగా శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ టీ హైదరాబాద్ వెస్ట్ జోన్ అధ్యక్షుడు గోపాల్ రాజ పురోహిత్, రాష్ట్ర యువ భారత్ అధ్యక్షుడు శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు నూనె సురేందర్, యోగా టీచర్ వెంకటేష్, రాజేందర్ తివారీ, భేరి రాంచందర్ యాదవ్ తదితరులు ఉన్నారు.