శేరిలింగంప‌ల్లిలో వామ‌ప‌క్ష‌ల బ్లాక్‌డే విజ‌య‌వంతం… ప్ర‌ధాన కూడ‌ళ్ల వ‌ద్ద క‌మ్యూనిస్ట్‌ నేత‌ల నిర‌స‌న‌…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లిలో వామ‌ప‌క్లాలు చేప‌ట్టిన బ్లాకేడే ప్ర‌శాంతంగా ముగిసింది. కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ‌, కార్మిక చ‌ట్టాల‌లోని స‌వ‌ర‌ణ బిల్లులు తీసుకువ‌చ్చి 6 నెల‌లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా ఆల్ ఇండియా కిసాన్ సంఘర్షణ సమితి బుద‌వారం బ్లాక్ డే నిర్వ‌హ‌ణ‌కు పిలుపునిచ్చింది. ఈ నెప‌థ్యంలో సిపిఎం, ఎంసిపిఐ (యు) ఆధ్వర్యంలో చందానగర్ గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ఆందోళ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షులు అభిషేక్, వామపక్ష నాయకులు శోభన్, మధు మాట్లాడుతూ ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగని పోరాటం చేస్తున్న రైతు ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా బ్లాక్‌డే నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. కార్పొరేట్ కంపెనీలకు దాసోహం అయిన కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ దేశాన్ని ఆదాని, అంబానీలకు తాకట్టు పెట్టే విధంగా ప్ర‌ధాని చర్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగం చేస్తున్న అలుపు ఎరుగని పోరాటానికి కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు మద్దతు ఇస్తాయని తెలిపారు. ఇప్పటికైనా నల్ల చట్టాలను వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కృష్ణ, ఎంసీపీఐయూ నాయ‌కులు పాల్గొన్నారు.

గాంధీ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స‌న తెలుపుతున్న హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్య‌క్షుడు అవినాష్‌, సీపీఎం నాయ‌కుడు శోభ‌న్‌

స్టాలిన్‌న‌గ‌ర్‌లో…
మియాపూర్ డివిజ‌న్‌ ప్రాంతంలోని స్టాలిన్ న‌గ‌ర్‌లో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్ ఆధ్య‌క్ష‌త‌న ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ నిర‌స‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గత ఆరు మాసాలుగా ఢిల్లీలో లక్షలాది మంది రైతులు రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తు పోరాటం చేస్తూంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవరిస్తూ దేశంలో కార్పొరేట్ విధానానికి వ్యవసాయ రంగాన్ని అప్ప చెప్తుందని ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నల కష్టార్జితాన్ని అలాగే వ్యవసాయ విధానాన్ని నీరుగార్చే విధంగా బిజెపి ప్రభుత్వం తీసుకువ‌చ్చిన‌ వ్యవసాయ వ్యతిరేకమైన నల్ల చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో యూపీఎన్ఎం రాష్ట్ర అధ్యక్షులు మైదం శెట్టి రమేష్,ఏఐఎఫ్‌డీవై నాయకులు శ్రీనివాసులు, శంకర్, సత్యనారాయణ, ఏఐఎఫ్‌డీడ‌బ్ల్యూ నాయకురాలు జి.లావణ్య, డి.లక్ష్మి, ఏఐఎఫ్‌డీఎస్‌ నాయకులు ఎం.వివేక్వీ, ఏఐసీటీయూ నాయకులు కె. మాధవరావు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

స్టాలిన్‌న‌గ‌ర్‌లో పార్టీ నాయ‌కుల‌తో నిర‌స‌న తెలుపుతున్న‌ ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్య‌ద‌ర్శివ‌ర్గ స‌భ్యులు వ‌నం సుధాక‌ర్‌

ఎంఏన‌గ‌ర్‌లో…
మియాపూర్ ఎంఏన‌గ‌ర్‌లోని ఎంసీపీఐయూ గ్రేట‌ర్ కార్యాల‌యం ముందు ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లెమురళి ఆధ్య‌క్ష‌త‌న నిర‌స‌న కార్య‌క్ర‌మం తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప‌ల్లె ముర‌ళి మాట్లాడుతూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని గౌరవించి రైతు చట్టాలను రద్దు చేసి స్వామినాథన్ కమిషన్ సూచ‌న‌ల‌కు అనుగుణంగా పంటకు 50 % గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఏపీఎంసీ సెంటర్లను పెంచి కార్పొరేట్ శక్తుల పక్షణా కాకుండా రైతుల పక్షాన నిలబడి రైతులకు భ‌రోసా నివ్వలని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏఐఎఫ్‌డీఎస్ గ్రేట‌ర్ క‌మిటి స‌భ్యుడు మ‌ధు, మియాపూర్ డివిజ‌న్ స‌భ్యులు ర‌వి, రాములు, వెంక‌టేష్‌, అశోక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఎంఏన‌గ‌ర్‌లో నిర‌స‌న తెలుపుతున్న ప‌ల్లె ముర‌ళి త‌దిత‌రులు

న‌డిగ‌డ్డ తండాలో…
ఎంసీపీఐయూ గ్రేట‌ర్ కార్య‌ద‌ర్శి వి.తుకారాం నాయ‌క్ అధ్య‌క్ష‌త‌న మియాపూర్ డివిజ‌న్ న‌డిగ‌డ్డ తండాలో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా తుకారాం నాయ‌క్ మాట్లాడుతూ రైతు ఉద్యమం ప్రారంభం నుండి నేటి వరకు 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్ప‌డ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతులు వ్యవసాయ సంక్షోభం కారణంగా పట్టణాలకు వలసలు వెళ్తున్నారని, ఇప్ప‌టికైన ప్ర‌భుత్వం వారి బాద‌లు గుర్తెరిగి న‌ల్ల‌చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంసీపీఐ(యూ) గ్రేట‌ర్ కమిటీ సభ్యులు డి. నర్సింహా, సోనిబాయి, ఏఐఎఫ్‌డీఎస్‌ నాయకులు వి.రాము నాయక్, కె.పండు నాయక్, వి.లక్ష్మణ్ నాయక్, సన్నీ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

న‌డిగ‌డ్డ తండాలో నిర‌స‌న తెలుపుతున్న తుకారం నాయ‌క్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here