ప్ర‌భుత్వ వైద్య‌ సిబ్బందికి ఫేస్ షీల్డ్‌లు అంద‌జేసిన బిజెపి జిల్లా కార్య‌ద‌ర్శి మూల అనిల్ గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: బిజెపి రంగారెడ్డి జిల్లా అర్భ‌న్ కార్య‌ద‌ర్శి మూల అనిల్ గౌడ్ ఆద్వ‌ర్యంలో కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా ద‌వాఖానా, రాయ‌దుర్గంలోని ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్రం సిబ్బందికి ఫేస్ షీల్డ్ మాస్కులు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా అనిల్ గౌడ్ మాట్లాడుతూ క‌రోనా క‌ష్ట‌కాలంలో అహ‌ర్నిష‌లు శ్ర‌మిస్తున్న వైద్య సిబ్బంది ర‌క్ష‌ణ నేప‌థ్యంలో పీడ్మాంట్‌ తెలుగు అసోసియేష‌న్(యూఎస్ఏ) సౌజ‌న్యంతో ఫేస్ షీల్డులు అంద‌జేయ‌డం జ‌రిగుతుంద‌ని అన్నారు. కొండాపూర్ జిల్లా ద‌వాఖానా సూప‌రింటెండెంట్ వ‌ర‌దాచారి మాట్లాడుతూ ప్ర‌భుత్వ వైద్య సిబ్బందికి స‌ర్కారు అందిస్తున్న స‌హ‌కారానికి తోడుగా స్వ‌చ్ఛంద సంస్థ‌లు, నాయ‌కులు చేయూత‌నందించ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. పీడ్మాంట్ తెలుగు అసోసియేష‌న్‌కు వారు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, నాయకులు నక్క శివ కుమార్, రఘు కోవురి, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్ ఏరియా హాస్పిట‌ల్ సూరెంటిండెంట్ వ‌ర‌దాచారికి ఫేస్‌షీల్డ్‌లు అంద‌జేస్తున్న మూల అనిల్ గౌడ్‌, జ్ఞ‌నేంద్ర ప్ర‌సాద్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here