శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని విద్యా నికేతన్ స్కూల్ లో డివిజన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. డివిజన్ బీజేపీ అధ్యక్ష్యుడు రాజు శెట్టి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకురాలు ఉమా మహేశ్వరి, అతిథిగా శేరిలింగంపల్లి బీజేపీ నాయకుడు రవి కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు అందరూ ముక్త కంఠంతో పలు రాజకీయ తీర్మానాలు చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు కె.ఎల్లేష్, సీనియర్ నాయకులు కాంచన కృష్ణ, శాంతి భూషణ్ రెడ్డి, బీజేవైఎం నాయకులు ఎన్.చంద్ర మోహన్, ఎం.రమేష్, డివిజన్ ఉపాదక్ష్యుడు బాలరాజు, డివిజన్ ప్రధాన కార్యదర్శులు చిట్టా రెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి, సత్య కుర్మ, కార్యదర్శులు, కోశాధికారి, వివిధ మోర్చా నాయకులు, శక్తి కేంద్ర, బూత్ అధ్యక్ష్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.