శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గెలుపొందిన తెరాస కార్పొరేటర్లు ఆదివారం ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీల ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
