కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొండాపూర్ డివిజన్ తెరాస కార్పొరేటర్‌గా మళ్లీ గెలుపొందినందుకు గాను హమీద్ పటేల్ ఆదివారం ఎంపీ రంజిత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ డివిజన్ ప్రజలు తనపై ఓటు వేసి నమ్మకంతో మరోసారి కార్పొరేటర్‌గా గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. డివిజన్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు.
