నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ శాంతినగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పర్యటించారు. డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్, శాంతి నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఓవర్ ఫ్లో కావడంతో కాలనీ రహదారులపై మురికి నీరు ప్రవహిస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కాలనీ వాసులకు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, కాలనీ వాసులు వెంకటేశ్వర రావు, శ్రీనివాస్, బబ్లూ, అధికారులు ఏఈ శివప్రసాద్, వర్క్ ఇన్‌స్పెక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.