నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల మహోత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహించుకునేలా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి రూ. 23.20 లక్షలు మంజూరు చేసిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాల కోసం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 72 దేవాలయాలకు మంజూరు చేసిన రూ. 23.20 లక్షల నిధులను చెక్కుల రూపంలో దేవాలయాల కమిటీ ప్రతినిధులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల మహోత్సవాలకు నిధులు మంజూరు చేయడం పట్ల సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాశీనాథ్ యాదవ్, తిరుపతి, చిన్నోళ్ల శ్రీనివాస్, శ్రీనివాస్ చౌదరీ, రజినీకాంత్, విద్యాసాగర్, గణపతి, తదితరులు పాల్గొన్నారు.