శాఖాంబరిగా దర్శనమిచ్చిన శ్రీ లలితాపోచమ్మ తల్లి

నమస్తే శేరిలింగంపల్లి: ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమి నగర్, వేముకుంట శ్రీ లలితాపోచమ్మ త‌ల్లి శాఖాంబ‌రిగా ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆలయ నిర్వాహకులు, మాజీ కౌన్సిలర్ గుర్రపు రవీందర్ రావు మాట్లాడుతూ ఆషాడ‌మాసంలో ఆన‌వాయితీగా ఆలయంలో ప్రతి ఏటా ఘనంగా బోనాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరం ఆషాడ బోనాలను కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం బోనాల ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం శ్రీ లలితా పోచమ్మ వారిని ఆకు కూరలు, కూరగాయలతో అందంగా అలంకరించి శాఖాంబరిగా పూజించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శాఖాంబ‌రి ద‌ర్శ‌నం చేసుకున్నార‌ని తెలిపారు.

శాఖాంబరిగా దర్శనమిస్తున్న శ్రీ లలితాపోచమ్మ తల్లి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here