వరద నీటి కాలువ నిర్మాణం పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్, కృషి నగర్ లోని ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారం కోసం‌ రూ. కోటి అరవై లక్షల నిధుల‌ వ్యయంతో నిర్మిస్తున్న వరద నీటి‌ కాలువ ను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుక్రవారం పరిశీలించారు. ఈ వరద నీటి కాలువ నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయని, ఇక నుంచి ముంపు ప్రాంతాల ప్రజల సమస్య తీరినట్టేనని అన్నారు.

వరద నీటి కాలువను పరిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here