శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాధవ హిల్స్, సిద్ధిక్ నగర్, అంజయ్య నగర్, సఫారీ నగర్, ఓల్డ్ పీజేఆర్ నగర్, మార్తాండ్ నగర్, హనీఫ్ కాలనీ, ప్రేమ్ నగర్ ఏ బ్లాకు, ప్రేమ్ నగర్ బీ బ్లాకులలో ఏర్పాటు చేసిన జాతీయ త్రివర్ణ పతాకాలను ఆయా కాలనీ, బస్తీవాసులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలసి యువ జన నాయకుడు షేక్ అఖిల్ పటేల్ ఎగురవేసి గౌరవ వందనం గావించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా కాలనీ, బస్తీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, జాతీయ త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేశారు.






