శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): బీహెచ్ఈఎల్ తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ లోక్ జనశక్తి పార్టీ లేబర్ సెల్ అధ్యక్షుడు జీ సురేందర్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మూడు రంగుల జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దేవా అర్జున్, వివిధ యూనియన్ అసోసియేషన్లు, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.






