శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రవి కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ముందంజలో ఉండాలని అన్నారు. ప్రతి బూత్ లో 300లకు మించకుండా సభ్యత్వ నమోదు చేపట్టి మరియే ఇతర పార్టీలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీకి ఎదురులేకుండా చూడాలని కార్యకర్తలను కోరారు. ఆల్విన్ కాలనీ డివిజన్ లోని తులసి నగర్, ధరణి నగర్, ఆల్విన్ కాలనీ ఫేజ్ 2, బూత్ స్థాయిలో కంటెస్టెడ్ కార్పొరేటర్ సురభి రవీందర్ రావు, డివిజన్ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామరాజు, నరసింహ చారి, కుమార్ యాదవ్, రామ్ రెడ్డి, శ్రీనివాసులు, రవీందర్ రెడ్డి, చారి, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, నరసింహారెడ్డి, రాయల్, రఘు, రమేష్, శివ, రాజు పాల్గొన్నారు.