శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ భవన్ లో శేరిలింగంపల్లి ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారని నియోజకవర్గం నాయకులు తెలిపారు. ఈ మేరకు వారు సోమవారం సమావేశం నిర్వహించారు. ఇందులో బీఆర్ఎస్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, జనార్దన్ గౌడ్, రాజు యాదవ్, ఉమేష్, పద్మనాభం పాల్గొని మాట్లాడుతూ ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు.