కులాంత‌ర వివాహాల‌ను ప్ర‌భుత్వం ప్రోత్స‌హించాలి: ప్ర‌కాష్ కార‌త్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కులాంతర వివాహాలు చేసుకున్న వారికి పది లక్షలు ఆర్థిక సాయం ప్రభుత్వం అందించాల‌ని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు. శేరిలింగంపల్లి పిజెఆర్ పార్కులో కెవిపిఎస్ విస్తృత సాయి మీటింగ్ ను నిర్వ‌హించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అనంత‌రం కెవిపిఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మస్కు ప్రకాష్ కారత్ మాట్లాడుతూ కేవీపీఎస్ ఈ సమాజంలో జరుగుతున్న కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు. కెవిపిఎస్ పోరాట ఫలితంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, శ్మ‌శాన వాటికల జీవో వచ్చిందన్నారు.

స‌మావేశం నిర్వ‌హిస్తున్న కేవీపీఎస్ నాయ‌కులు

ఈ రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారందరికీ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక స‌హాయం చేయాలన్నారు. కులాంతర వివాహాల చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా కులం దురహంకార హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల దూరహంకర దాడులు జరుపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కులాంతర వివాహాలు చేసుకున్న వారందరికీ ప్రభుత్వం రక్షణ కల్పించాలని దానికి ఒక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా సత్యం, ప్రధాన కార్యదర్శిగా ఎం శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ రాజు, సి రాజు, సహాయ కార్యదర్శిగా ఎం శ్రీనివాస్, నరేష్, కమిటీ సభ్యులుగా శాంతయ్య, సునీత, నరసింహ, నరేష్ స్వామి, వెంకటేశులను ఎన్నుకున్నారు. సంఘం గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్ యాదయ్యని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కొంగరి కృష్ణ, సునీత, శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here