నమస్తే శేరిలింగంపల్లి: అక్రమ అరెస్టులు, నిరంకుశ నిర్భందాలను దాటుకుంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన మూడో విఢత ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా ముగియడం సంతోషకరమని శేరిలింగంపల్లి బిజెపి నాయకులు పేర్కొన్నారు. మూడో విఢత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు రోజున వరంగల్ జిల్లాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి శేరిలింగంపల్లి బిజెపి నాయకులు పాదయాత్ర చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విఢత పాదయాత్రలో కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి, నిరంకుశత్వ పాలనను ఎండగడుతూ ప్రజల దీవెనలతో విజయవంతం చేయడం జరిగిందన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్ కుమార్ కలిసి బిజెపి నాయకులు మువ్వ సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జానకిరామ రాజు, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి తదితరులు పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.