శేరిలింగంపల్లి, అక్టోబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): ఇజ్జత్ నగర్ బస్తీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంటుందని, ఈ విషయంపై సంబంధిత ట్రాఫిక్ పోలీసులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం శూన్యమని సిపిఐ రామకృష్ణ అన్నారు. ఇజ్జత్ నగర్ బస్తీకి చెందిన పలువురు కార్యకర్తలు ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించడంతో ట్రాఫిక్ ఎస్ఐ టీవీ రావు, డీసీ శ్రీదేవి బస్తీ నాయకులతో కలిసి సమస్యను పరిశీలించారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇజ్జత్ నగర్ బస్తీ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో హోండా సర్కిల్‌లో ట్రాఫిక్ రాకుండా ధర్నా కార్యక్రమం చేపడతామని సిపిఐ రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ యాదవ్, అంజి, శివ, ప్రేమ్, ఎం వెంకటేష్, ఎస్ కొండలయ్య, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, శశి ఆనందు, శంకర్, తెలంగాణ మహేష్, రంగస్వామి, ఎస్ నరసమ్మ, ఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.






