శేరిలింగంపల్లి, అక్టోబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోమవారం 42% బీసీ రిజర్వేషన్లు – ఉద్యమ కార్యాచరణ అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. మేధావులు, అడ్వకేట్లు, బీసీ సంఘలు, కుల సంఘాల నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ తో మాత్రమే బీసీ రిజర్వేషన్లకు రక్షణ ఉంటుందని తాము మొదట్నుంచి చెబుతున్నామని అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర చేసి ప్రజలను చైతన్యం చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ , బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని వారు ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల కోసం కలిసి వచ్చే బీసీ, కుల సంఘాల నేతలతో ప్రత్యేకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ టీ. చిరంజీవులు, బీసీ , ఎస్సీ, ఎస్టీ , జేఏసీ చైర్మన్ విశారద మహారాజ్, తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, బీసీ సంఘాల నాయకులు రాచాల యుగేందర్ గౌడ్, మేకపోతుల నరేందర్ గౌడ్, ఎస్.దుర్గయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక సభ్యులు చామకూర రాజు, కెవి గౌడ్, ఎర్రమాద వెంకన్న నేత, కిరణ్ కుమార్, అవ్వారు వేణు, బైరు శేఖర్, లింగేష్ యాదవ్, బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం దేవరాజ్ గౌడ్, సింగం నాగేశ్వర్ గౌడ్, బత్తిని కీర్తి లత, బొల్లంపల్లి ఆంజనేయులు, బొమ్మ రఘురాం నేత, కొండల్ గౌడ్, ఘోరా శ్యామ్, దాసు సురేష్, డాక్టర్ విజయకుమార్, అడ్వకేట్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






