శేరిలింగంపల్లి, అక్టోబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్ మనికరణ్, ACP నాగిరెడ్డి , AMOH Dr. K. S. రవి, Engineering section దుర్గాప్రసాద్, Entomology section R.చిన్నా, UBD section సమీర, Electrical section లక్ష్మి ప్రియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ ఫిర్యాదులను సంబంధిత అధికారులు, సిబ్బందికి అందజేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 14 ఫిర్యాదులు రాగా, ఇంజినీరింగ్‌లో 3, వెటర్నరీలో 1 మొత్తం 18 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను AMC మనికరణ్ ఆదేశించారు.






