శేరిలింగంపల్లి, అక్టోబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): భారతదేశంలోని సంస్థానాలను ఏకతాటిపైకి తెచ్చిన ధీశాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. అందరూ ఒక్కటై కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి ఐక్యతను చాటుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో నిజమైన మార్పుకు నాంది పలకాలని పిలునిచ్చారు. ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్, రాకేష్ వసంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఓయూ కాలనీలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు, బ్రిటిష్ వారు మన దేశాన్ని విభజించి పాలించే సమయంలో దేశంలో ని 565 సంస్థానాలను ఏకతాటిపైకి తెచ్చిన ధీశాలి, మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా నిజాం నవాబులు హైదరాబాద్ ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తూ పాలిస్తున్న సమయంలో పటేల్ నేతృత్వంలో 1948 లో స్వాతంత్రం తెచ్చిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వామి గౌడ్, వరలక్ష్మి , చంద్రకళ, నాగరాజు సుమలత, స్వామి, సంజీవ్, నరేందర్ యాదవ్, నిఖిల్ , రాజు , దుర్గారావు, లక్ష్మణ్, గణేష్ , శ్రీనివాస్, రాము తదితరులు పాల్గొన్నారు.





