శేరిలింగంపల్లి, జనవరి 14 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ అరబిందో కాలనీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐసిఐసిఐ బ్యాంక్ బిజినెస్ హెడ్ ఉదయ్ కుమార్ తన కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి భోగిమంటల వద్ద సందడి చేశారు. అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరు కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సంబురాల్లో మియాపూర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.






