శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్‌లో ఉన్న సంకల్ప్ ఫౌండేషన్ అధ్యక్షురాలు రోజీ చేస్తున్న సేవలు, సామాజిక కార్యక్రమాలను అభినందిస్తూ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుక్రవారం ఆమెను అభినందించారు. గవర్నర్‌ను కలిసిన రోజీ ఈ మేరకు ప్రశంసలు అందుకున్నారు. రోజీలా ప్రతి ఒక్కరు సమాజ సేవ చేసేందుకు ముందుకు రావాలన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ..
సంకల్ప్ ఫౌండేషన్‌కు చెందిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. శ్రీధర్ బాబును ఆయన కార్యాలయంలో కలిసిన రోజీ ఆ మేరకు ఫౌండేషన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






