నమస్తే శేరిలింగంపల్లి: శానిటేషన్ సమస్య లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి సూచించారు. స్వచ్ఛ శేరిలింగంపల్లి లో భాగంగా వార్డు కార్యాలయం లో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని ఆయా కాలనీలలో, బస్తీలలో జరుగుతున్న శానిటేషన్ పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఏఎంహెచ్ఓ డాక్టర్ రవి కుమార్, సూపర్ వైజర్ జలేందర్, ఎస్ఎఫ్ఏ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.
