నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ తిరుగు లేని శక్తిగా తీర్చిద్దేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని దోబిఘాట్ బస్తీ, నవభారత నగర్ లో టీఆర్ఎస్ కమిటీలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యున్నతికి పాటుపడేవారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్ర గుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు సాంబశివ రావు, ఎ.కె బాలరాజుతో కలిసి దోబి ఘాట్ బస్తీ కమిటీతో పాటు యూత్, మైనారిటీ, మహిళా కమిటీలను పూర్తి స్థాయిలో వేసినట్లు తెలిపారు. దోబిఘాట్ బస్తి అధ్యక్షునిగా రాందాస్, యూత్ కమిటీ అధ్యక్షునిగా హరికృష్ణ, మహిళ కమిటీ అధ్యక్షురాలిగా ధనలక్ష్మి ని ఎన్నుకున్నారు. నవభారత నగర్ బస్తీ కమిటీ అధ్యక్షునిగా మహ్మద్ సాదిక్, యూత్ కమిటీ అధ్యక్షునిగా ఎండి సిరజ్, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా షాహిన్ తాజ్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో ఆంకా రావు, అఫ్రోజ్, షేక్ ఖాజా, సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.
