నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ గంగారం గ్రామంలో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, కోట్ల రూపాయలతో నిర్మించిన మోడల్ రైతు బజార్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. హఫీజ్ పేట్ డివిజన్ గంగారాం, హుడా కాలనీలో డివిజన్ అధ్యకుడు శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన బస్తీబాటలో బిజెపి నాయకులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్య సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు.
కోటి 30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మోడల్ మార్కెట్ షెడ్లను లబ్దిదారులకు కేటాయించకపోవడంతో నిరుపయోగంగా మారాయన్నారు. నిరుపయోగంగా ఉన్న షెడ్లను జిహెచ్ఎంసి అధికారులు ఉపయోగంలోకి తీసుకువచ్చి ప్రజాధనాన్ని కాపాడాలని సూచించారు. బిజెపి నాయకులు గజ్జల యోగానంద్, మువ్వ సత్యనారాయణ, నరేష్, డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, మహేష్ యాదవ్, నవత రెడ్డి, ఎల్లేష్, దేవ్ ఆనంద్ యాదవ్, అశోక్, రమణయ్య, శ్రీనివాస్ యాదవ్, రంగారెడ్డి, అర్జున్, కౌశిక్, పద్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు.