శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు ఆధ్వర్యంలో కుందన సంగీత నిలయం గురువు సతీష్ సాలూరి, ఆయన బృందం బి. అలేఖ్య రామచంద్ర, జి. అంజలీ రవీంద్ర, జి. స్వప్న ప్రభాకర్ రెడ్డి, ఎం. జ్యోత్స్న శ్రీశైలం, ఎన్. సునీత మురళీధర్ రెడ్డి, ఎన్. పద్మ సీతమ్మ హనుమంతు, పి. కీర్తన రమేష్, వి. సరిత రాఘవేందర్ గౌడ్, ఎన్. ప్రియాంక అమర్, వి. ఆర్. సావిత్రి ప్రకాష్, ఎన్. సురేఖ బాలసుబ్రహ్మణ్యసాయి, ఈ. కళ్యాణి మల్లికార్జునరావు, కే. వినోద సత్యన్నారాయణ చారి, ఆర్. వాణి సతీష్ కుమార్, ఓంకారేశ్వరి, డి. అర్చన ప్రభాకర్, ఆర్. సుజాత రాజేందర్, జి. జయశ్రీ రాంచందర్, కే. హిమజ వేణు, ఏ. శ్యామల శివారెడ్డి, ఎన్. లావణ్య వినోద్ కుమార్, డి. అనుదీప్, ఎం. లక్ష్మీ పతి, ఎం. ఆకాశ్, పి. గోపాల్ సంయుక్తంగా మహాగణపతిం అనే గణేశ స్తుతి తో ప్రారంభించి, సరస్వతి నిను అంటూ కొనసాగిస్తూ, కంటి శుక్రవారం, అదివో అల్లదివో, చక్కని తల్లికి, కొండలలో నెలకొన్న, తందనాన అహి, చాలదా హరినామ, వినరో భాగ్యము, అన్ని మంత్రములు, కట్టెదురా వైకుంఠం, అంతయు నీవే, ముద్దుగారే యశోద, చిత్తజ గురుడ, క్షిరాబ్ధి కన్యకకు అనే బహుళ ప్రాచుర్యం పొందిన అన్నమయ్య సంకీర్తనలను భక్తి శ్రద్ధలతో పాడారు. వీరికి తబలా మీద కే. ప్రశాంత్, కీ బోర్డు మీద పవన్ కుమార్ వాయిద్య సహకారం అందించారు.
అనంతరం కళాకారులకు, అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ ఙ్ఞాపికను అందించారు. చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతి ఇచ్చి వారి తీర్థ ప్రసాదాలతో అన్నమ స్వరార్చన దిగ్విజయంగా ముగిసింది.